
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.) ఏపీ ప్రభుత్వం
పోలీస్ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో APSLPRB ప్రకటించనుంది. దరఖాస్తును అధికారిక వెబ్సైట్ (https://slprb.ap.gov.in) ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ