ఏపీకి వర్ష సూచన
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain


ఆంధ్రప్రదేశ్, 16 సెప్టెంబర్ (హి.స.)ఏపీలోని పలు జిల్లాల్లో అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంగి ఉందని అధికారులు వెల్లడించారు. రాయలసీమ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి కేంద్రం అంచనా వేసింది. ఇక్కడ కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమున్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande