వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.....కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్వో వేతన పరిమితిని 15వేల నుంచి 25వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Epf


ఢిల్లీ , 16 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్వో వేతన పరిమితిని 15వేల నుంచి 25వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మంది ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల సామాజిక భద్రతా పరిధిని మరింత విస్తరించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేతన పరిమితి పెంపుతో ప్రభుత్వంపై ఏటా సుమారు 11వేల339 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. పీఎఫ్ పరిధిని విస్తరించడం ద్వారా ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కంపెనీలు, యాజమాన్యాలు తమ సిబ్బందిని దీర్ఘకాలం పాటు తమవద్దే కొనసాగించుకునేందుకు కాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande