గుంతకల్లులో ట్రాన్స్జెండర్ సోదరుడు దారుణ హత్య
ట్రాన్స్జెండర్ల మధ్య జరిగిన గ్రూప్ వార్లో ఒకరు కన్నుమూశారు. వినాయకమండపం ఆహ్వానం విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది.
గుంతకల్లులో ట్రాన్స్జెండర్ సోదరుడు దారుణ హత్య


గుంతకల్లు, 16 సెప్టెంబర్ (హి.స.) అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది.

ట్రాన్స్జెండర్ల మధ్య జరిగిన గ్రూప్ వార్లో ఒకరు కన్నుమూశారు. వినాయకమండపం ఆహ్వానం విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో వీరేష్ అనే ట్రాన్స్ జెండర్, అతడి సోదరుడు చరణ్ అలియాస్ జగన్ పై మరో ట్రాన్స్జెండర్ గ్రూప్ కర్రలు, కత్తులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ట్రాన్స్జెండర్ సోదరుడు చరణ్ మరణించాడు.

వీరేష్కు సైతం గాయాలవ్వగా అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా హత్యకు ట్రాన్స్ జెండర్ల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరే కారణం అని భావిస్తున్నారు. గత కొంతకాలంగా ట్రాన్స్ జెండర్ల మధ్య గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ హత్యకు సంబంధించి నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఏం జరిగింది.?, మృతుడితో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా.?, ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande