పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు
పాకిస్థాన్ యుద్ధనౌక భారత నిఘా నౌకను ఢీకొంది. ఈ ఘటనపై పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీచేసింది.
CDA


ఢిల్లీ , 16 సెప్టెంబర్ (హి.స.)పాకిస్థాన్ యుద్ధనౌక భారత నిఘా నౌకను ఢీకొంది. ఈ ఘటనపై పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీచేసింది. పాక్ నేవీని అదుపులో పెట్టుకోవాలని పాక్కు భారత విదేశాంగశాఖ గట్టి హెచ్చరికలు చేసింది.

సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఓ ఫ్రంట్లైన్ యుద్ధనౌక సాధారణ నిఘా కార్యకలాపాల్లో భాగంగా సముద్రంలో పర్యటిస్తుండగా, పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ నౌక దాని వైపు వచ్చినట్లు తెలుస్తోంది. పాక్ నౌక అధిక వేగంతో భారత నౌకకు సమీపంగా వచ్చి, అసురక్షితంగా, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా దిశ మార్చుకోవడంతో రెండు నౌకలు ఢీకొన్నట్లు భారత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనలో భారతీయ నావికాదళ సిబ్బందికి గానీ, యుద్ధనౌకకుగానీ ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande