
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
భారతదేశం మరియు దక్షిణ అమెరికా దేశాల వాణిజ్య కూటమి MERCOSUR (మెర్కోసూర్) మధ్య దౌత్య, వ్యాపార సంబంధాల్లో ఒక కీలక ఘట్టం నమోదైంది. ఇరు వర్గాల మధ్య డిజిటల్ విధానంలో పేపర్‌లెస్ ట్రేడ్‌ను పెంచడానికి ఉద్దేశించిన మొదటి అదనపు ప్రోటోకాల్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ప్రకారం, ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ (e-CoO)కి కాగితపు పత్రాలతో సమానంగా చట్టబద్ధత మరియు ప్రాధాన్యత లభిస్తుంది. దీనివల్ల భారత్ మరియు బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు చాలా సులభతరం కావడమే కాకుండా కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియలో కాలయాపన తప్పుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi