
ఢిల్లీ , 16 సెప్టెంబర్ (హి.స.)
'షాజాద్ భట్టి నెట్వర్క్' (ఎస్ బీఎన్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు అమిత్ షా 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ నెట్ వర్క్ అక్రమ కార్యకలాపాలపై ఉపాతో పాటు భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం, ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం వంటి పలు చట్టాల కింద కేసులు నమోదయ్యాయని అమిత్ షా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్