
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
గణేశ్ ఉత్సవ కమిటీ, ఎస్వీ ఎంటర్టైన్మెంటు ఆధ్వర్యంలో గాజువాక సమీప శ్రీనగర్లో గాజుల గణపయ్య మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార వ్యాపార స్టాళ్లు నిర్వహించడం, యమలోకం, డైనోసార్ సెట్టింగ్ల వద్ద టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, సీఐ వాసునాయుడు, జెడ్సీ శేషాద్రి, మండల రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు సంయుక్త విచారణకు రంగంలోకి దిగారు. స్టాళ్లు తీసేయాలని, ఉచిత దర్శనాలకు మాత్రమే అంగీకరిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. తాము రూ. లక్షలు వెచ్చించి ఉత్సవాలు జరుపుతుంటే అధికారులు అడ్డుచెప్పడంపై నిర్వాహకులు వాదనకు దిగారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. అయినా టికెట్ల విధానాన్ని అంగీకరించేది లేదని ఏసీపీ స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకులు దర్శనాలను నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ