నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు.
మంత్రి నారా లోకేష్కు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం!


నెల్లూరు, 16 సెప్టెంబర్ (హి.స.)నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా తొలుత ఉదయం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చేరుకుంటారు. స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను, మూలపేటలోని డీఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించే అవకాశం ఉంది.కోవూరు పట్టణంలోని నెల్లూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెన్నై-విజయవాడ హైవే వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో జరిగే సమన్వయ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande