పుట్టపర్తిలో గణేశ్ ఉత్సవాలకు నైట్ విజన్ డ్రోన్లతో గణేష్ నిమజ్జన ప్రత్యేక నిఘా!
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.
పుట్టపర్తిలో గణేశ్ ఉత్సవాలకు   నైట్ విజన్ డ్రోన్లతో గణేష్ నిమజ్జన ప్రత్యేక నిఘా!


పుట్టపర్తి, 16 సెప్టెంబర్ (హి.స.)పుట్టపర్తిలో గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రల సమయంలో భారీ జనసందోహంపై నిఘా కోసం ఏఐ ఆధారిత నైట్ విజన్ డ్రోన్లను పోలీసులు వినియోగించనున్నారు. జనసమూహంలో అసాధారణ కదలికలను రియల్టైమ్లో గుర్తించి కమాండ్ కంట్రోల్కు సమాచారం పంపడం, రాత్రిపూట నిఘా, ఫేషియల్ రికగ్నిషన్, తప్పిపోయిన వారిని గుర్తించడం వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి.పుట్టపర్తి సెక్యూరిటీ వింగ్ సీఐ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో డ్రోన్ లతో నిఘా ఏర్పాటు చేపట్టారు. .

ఇప్పటివరకు గణేశ్ నిమజ్జనం, ఇతర భారీ కార్యక్రమాల్లో పోలీసులు డ్రోన్లను ప్రధానంగా ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించేందుకు ఉపయోగించేవారు. డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్ను సిబ్బంది పరిశీలించి పరిస్థితిని అంచనా వేసేవారు. అయితే ఏఐ ఆధారిత కొత్త వ్యవస్థలో డ్రోన్ స్వయంగా దృశ్యాలను విశ్లేషించి అసాధారణ పరిస్థితులను గుర్తించేలా రూపొందించారు. అక్కడి సిబ్బంది సమాచారాన్ని విశ్లేషించి ఘటనాస్థలికి సమీపంలోని పోలీసు బృందాలను అప్రమత్తం చేస్తారు. దీంతో స్పందించే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

పట్టణంలోని హనుమాన్ సర్కిల్, గోపురం, ఆర్టీసీ బస్టాండ్ గోవిందపేట, వివేకానంద రోడ్డు, సాయి నగర్,చిత్రావతి రోడ్డు, కర్ణాటక నాగేపల్లి, ఎనుముల పల్లి,గోకులం ప్రాంతాలలో రాత్రి సమయాలలో అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిశితంగా పరివేక్షించారు.గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిజం చేపట్టారు. భక్తుల రాకపోకలు మండపాల పరిసరాలు అనుమానాస్పద ప్రాంతాలతో పాటు జూదం ఇతర సాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande