
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026' అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.
ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ (RGI) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన అనంతరం, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో ఈ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చింది.
ఈ నూతన చట్టం ప్రకారం పుట్టుకలు, మరణాల వివరాల నమోదులో ఎలాంటి జాప్యం, అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను నిర్దేశించింది. సెక్షన్ 1 లోని ఉప-సెక్షన్ (2) ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు కేంద్ర ప్రభుత్వం 2026 అక్టోబర్ 1ని ఈ చట్ట నిబంధనలు అమలులోకి వచ్చే తేదీగా ఖరారు చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..