యూపీఐ చెల్లింపులు ఆపేస్తాం.....పెట్రోల్ పంప్ డీలర్స్ ఆందోళన
కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీల పై తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Petrol


ఢిల్లీ , 17 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీల పై తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేసి, కేవలం నగదు లావాదేవీలకే పరిమితం అవుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రూ.5 చొప్పున స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ లాభాలపై అది మరింత భారం మోపుతుందని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వం తన చమురు మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీ) ద్వారా లీటరుకు సుమారు రూ.2.40-3.40 లాభాన్ని తమకు నిర్దేశిస్తుందని, ఈ అతి తక్కువ లాభాలపై ఏ రూపంలోనైనా ఎండీఆర్ ఒక అదనపు భారం అవుతుందని పెట్రోల్ పంప్ డీలర్లు తెలిపారు. పెట్రోలియం రిటైల్ అవుట్లెట్లను సాధారణ రిటైల్ వ్యాపారాలతో పోల్చలేమనే కారణంతో మినహాయింపు కోరుతూ అఖిల కర్ణాటక పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్(ఏకేఎఫ్పీటీ) కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు లేఖ రాసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande