పాక్-చైనా సరిహద్దు జాయింట్ కమీషన్పై భారత్ తీవ్రఆగ్రహం – చట్టబద్ధత లేదంటూ స్పష్టీకరణ
పాక్-చైనా సరిహద్దు జాయింట్ కమీషన్పై భారత్ తీవ్ర ఆగ్రహం – చట్టబద్ధత లేదంటూ స్పష్టీకరణ
రణధీర్


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంత సరిహద్దుల నిర్వహణ నిమిత్తం పాకిస్థాన్, చైనాలు సంయుక్తంగా 'జాయింట్ బౌండరీ కమీషన్' ప్రారంభించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ కమీషన్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని, దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే లేదా ఒప్పందాలు చేసుకునే హక్కు పాకిస్థాన్‌కు లేదని తేల్చిచెప్పింది. 1963 నాటి పాక్-చైనా సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదని, ఇటువంటి చర్యల ద్వారా ఆక్రమిత ప్రాంతాల స్థితిగతులను మార్చడానికి చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని హెచ్చరించింది. ఇలాంటి ప్రదర్శనలు పక్కనబెట్టి, అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాలను పాకిస్థాన్ వెంటనే ఖాళీ చేయాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande