లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్
లంచం తీసుకుంటున్న ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Acb


ఆంధ్రప్రదేశ్ , 18 సెప్టెంబర్ (హి.స.)లంచం తీసుకుంటున్న ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు

పట్టుకున్నారు. భూమి పౌతి మార్పిడి ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి పౌతి మార్పిడి కోసం కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande