ఫార్ములా ఈ-రేసు కేసు.... విచారణ అక్టోబర్ 30కి వాయిదా
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది.
Court


హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫున న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణను కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన విదేశీ కంపెనీకి సమన్లు అందలేదన్నారు. దీంతో విచారణను కోర్ట్ వాయిదా వేసిందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని పిటిషన్ వేసినట్లు తెలిపారు.

అంతకుముందు తాము వేసిన పిటిషన్ న్యాయస్థానం రిటర్న్ చేసిందన్నారు. మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేస్తామని... కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని కేటీఆర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande