కాంగ్రెస్, బీఆర్ఎస్పై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. మరి కేసులు పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
Maheshwar reddy


హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. మరి కేసులు పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆ భూమిని ఎందుకు తిరిగి తీసుకోవడం లేదని నిలదీశారు. 23 లక్షల ఎకరాలు భూ మార్పిడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారని.. ఆ రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని అడిగారు.

గతంలో ధరణి, ఇప్పుడు భూ భారతితో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు. సెట్ పేరుతో వ్యవహారాన్ని సెట్ చేసుకోవాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల భూముల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఫారెస్ట్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయని అడిగారు. జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు.

జ్యుడీషియల్ విచారణ జరిపించాలని.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము అడిగిన లక్షల కోట్ల రూపాయల అవినీతిపై మాట్లాడలేదన్నారు. జ్యుడీషియల్ విచారణ జరిపే వరకు బీజేపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. పార్ట్ వన్ బీలో 5 లక్షల ఎకరాలు క్లియర్ చేశామన్నారని.. వాటికోసం ప్రత్యేక అప్లికేషన్లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande