
హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే క్రిశాంక్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
క్రిశాంక్ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల రాకతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం క్రిశాంక్ నివాసానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో పరిస్థితి రాజకీయంగా వేడెక్కింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్