రోడ్డు ప్రమాదం: ముగ్గురు ట్రాన్స్కో ఉద్యోగులు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Accident


హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న ఒక కార్, రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నిజామాబాద్ జిల్లాకు చెందిన పర్శి, సుధాకర్, విశ్వేశ్వర్గా పోలీసులు గుర్తించారు. వీరంతా ట్రాన్స్కో విభాగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande