కాణిపాక వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ
చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
కాణిపాక వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ


కాణిపాకం , 18 సెప్టెంబర్ (హి.స.) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

స్వామి వారి దర్శనానికి విచ్చేసిన మంత్రివర్యులు తొలుత దేవస్థానం అతిధి గృహమునకు చేరుకొని పోలీసులచే గౌరవ వందనం స్వీకరించగా పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు.

కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున ఈ రోజు శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రతి సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరపున తరపును పట్టువస్త్రాలను సమరిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande