
ఇడుపులపాయ, 18 సెప్టెంబర్ (హి.స.)ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె ఏకైక కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఖరారైంది.
సోమల రఘురామ్ రెడ్డితో అంజిలి రెడ్డి ఏడడుగులు వేయనున్నారు. ఈ శుభవార్తను షర్మిల స్వయంగా ప్రజలతో పంచుకున్నారు. వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం, ముహూర్తం, రిసెప్షన్ తేదీలను ఆమె అధికారికంగా వెల్లడించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి వివాహానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో..తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి -సోమల రఘురామ్ రెడ్డిల..పరిశుద్ధ వివాహ మహోత్సవం వైఎస్సార్ కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణమని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా నవంబర్ 25న వివాహం జరుగుతుందని, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ ఆశీస్సులతో వివాహ వేడుక జరగడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV