విశాఖలో 26 వేలకుపైగా ఇళ్లకు పట్టాలు.. ఏపీ ప్రభుత్వం కీలక కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న 26 వేలకు పైగా అనధికారిక ఇళ్లను క్రమబద్ధీకరించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
AP Govt


అమరావతి , 19 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న 26 వేలకు పైగా అనధికారిక ఇళ్లను క్రమబద్ధీకరించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఇళ్లకు సంబంధించిన భూముల మార్కెట్ విలువ సుమారు రూ.8,800 కోట్లుగా అధికారులు అంచనా వేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ కుటుంబాలకు ఇంటి స్థల హక్కు పత్రాలను సెప్టెంబర్ 19న అందించనున్నట్లు అధికారులు తెలిపారు. చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలకు భూమిపై చట్టబద్ధమైన హక్కు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇల్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాలు, ఆస్తి బదలాయింపు వంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా తమ నివాసాలకు భద్రత ఉంటుందా లేదా అనే ఆందోళన కూడా ఆయా కుటుంబాల్లో కొనసాగుతూ వచ్చింది. అధికారిక రికార్డుల్లోకి ఇళ్లు, కుటుంబాల వివరాలు రావడం వల్ల భవిష్యత్తులో పౌర సేవలు, ఆస్తి సంబంధిత లావాదేవీలకు కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande