రోజ్గార్ మేళాలో యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నిర్వహించనున్న 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేయనున్నారు.
PM modi


ఢిల్లీ , 19 సెప్టెంబర్ (హి.స.)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నిర్వహించనున్న 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక పత్రాలను అందజేయడంతో పాటు, ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

20వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో విధుల్లో చేరనున్నారు.

యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, దేశ అభివృద్ధి ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచడం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యల్లో భాగంగానే రోజ్గార్ మేళాను నిర్వహిస్తున్నారు.

20వ రోజ్గార్ మేళాతో కలిపి, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఇప్పటివరకు సుమారు 12.75 లక్షల మంది యువతకు నియామక పత్రాలు అందించినట్లవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande