పర్యావరణ పరిరక్షణలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది....ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో “ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్” పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
PM Modi


ఢిల్లీ , 19 సెప్టెంబర్ (హి.స.)నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో “ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్” పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఈ రెండు రోజుల సదస్సు జరుగుతోంది.

ఈ సదస్సులో పర్యావరణం, వాతావరణ మార్పులు, విధానాల రూపకల్పన, అమలు, పర్యావరణ చట్టాల అమలు వంటి అంశాలపై ఇందులో చర్చలు జరగనున్నాయి. 17 దేశాలకు చెందిన న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

ఈ సందర్బంగా సదస్సులో ప్రధాని ప్రసంగించారు. భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటుతో పోలిస్తే సగం కంటే తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఉద్గారాలు భారత్తో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పారు.

గత 12 సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధాని తెలిపారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా లక్షలాది ఇళ్లలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande