హుబ్బళ్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్వస్థత: కార్యక్రమాలు రద్దు
హుబ్బళ్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్వస్థత: కార్యక్రమాలు రద్దు
KR-Amit-Shah-to-participate-in-various-programs


హుబ్బళ్లి (కర్ణాటక):, 19 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. శనివారం (సెప్టెంబరు 19) కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరగాల్సిన పలు అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు.

శుక్రవారం రాత్రే హుబ్బళ్లి చేరుకున్న అమిత్ షా, శనివారం ఉదయం కేఏహెచ్‌ఈఆర్ (KAHER) సంస్థకు చెందిన జేజీఎంఎం మెడికల్ కాలేజ్, కేఎల్ఈ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సలహా మేరకు హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

వేదిక వద్ద వేలాది మంది ప్రజలు, నాయకులు ఎదురుచూస్తుండగా.. అమిత్ షా అస్వస్థత వల్ల రాలేకపోతున్నారని కేఏహెచ్‌ఈఆర్ ఛాన్సలర్ ప్రభాకర్ కోరే అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, కేవలం వైద్యుల సూచనల మేరకే హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande