
నంద్యాల, 19 సెప్టెంబర్ (హి.స.)పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.
నంద్యాల జిల్లా అవుకు గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అవుకు ప్రధాన వీధుల్లో నిర్వహించిన స్వచ్ఛత అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేస్తూ స్వచ్ఛత కార్యక్రమంలో స్వయంగా భాగస్వామ్యమయ్యారు. ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.అవుకులో ఆధునిక వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, బయోగ్యాస్, వేస్ట్ టు ఎనర్జీ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు మంత్రి సూచించారు. స్వచ్ఛమైన అవుకు కోసం ప్రజల సహకారం అవసరమని మంత్రి తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. స్వచ్ఛాంద్ర - స్వర్ణాంధ్రతో గ్రామాలు, పట్టణాలు మరింత అందంగా మారుతాయని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV