సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి జలాలు విడుదల
Chandrababu Naidu(file)


అనకాపల్లి, 02 సెప్టెంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి జలాలు విడుదల చేసారు.

తొలుత సీఎం చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదారమ్మకు సీఎం జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం.రమేశ్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande