తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్


తిరుమల, 02 సెప్టెంబర్ (హి.స.)

ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని నేడు బుధవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్.. జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande