
హైదరాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు కేటీఆర్.
రాష్ట్రంలో నేటితో సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావుతో కలసి తెలంగాణ భవన్లో నేడు వారు షార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిన్న చెక్ డ్యాం కూడా కట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ ఏం సాధించింది అంటే నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్ డ్యాం కట్టలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు,పచ్చ కాంగ్రెస్ కాదు, లుచ్చ కాంగ్రెస్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అసలైన కాంగ్రెస్ లేదని తెలంగాణ సమాజాం అనుకుంటుందన్నారు. మొదటి నుంచి వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి అందలం ఎక్కించారన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ శతాబ్దం అతి పెద్ద మోసం కాంగ్రెస్ మోనిఫెస్టో అని విమర్శించారు.
చంద్రబాబుకు చంచాగిరి చేస్తూ గురువుగారికి దక్షిణగా కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడు. అందాల పోటీలకు పెట్టిన ఖర్చులో పదో వంతు ఖర్చు చేస్తే కాఫర్ డ్యాం కట్టి నీళ్లు ఇయ్యొచ్చని ఇంజిర్లు చెప్పారు. వారికి బెల్టు ట్రీట్మెంట్ ఉంటుందని భయపెట్టారన్నారు. ఎస్ఎల్బీసీ కుప్పకూల్చినా, చెక్కు డ్యాంలు కూలినా బీజేపీ, ఎన్డీఎస్ఏ నోరు తెరువదు. జీఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఎజెండా పెడితే పారిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే అధికారి ఆదిత్య నాద్ దాస్ ను సలహాదా రుగా పెడితే తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ భూములను కొల్లగొడుతున్నారు. రూ.50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని రూ.20 కోట్లతో ముగించారని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..