
మంగళగిరి, 02 సెప్టెంబర్ (హి.స.)
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలోని విద్యా భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రత్యేక టెట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. టీచర్ల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విద్యాభవన్లోకి వెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.
ఉపాధ్యాయుల ముఖ్య డిమాండ్లు
- టెట్ నుంచి మినహాయింపు: ఇప్పటికే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించి, సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న సీనియర్ (ఇన్-సర్వీస్) ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) రాయడం నుండి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలి.
- అసెంబ్లీ తీర్మానం: తమిళనాడు తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన వర్తించకుండా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలి.
- మార్కుల తగ్గింపు: ఒకవేళ ప్రత్యేక టెట్ నిర్వహిస్తే, అందులో అర్హత మార్కులను (Pass Marks) 40 శాతానికి తగ్గించాలి.
- సబ్జెక్ట్ పరిమిత పరీక్ష: గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు కేవలం వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్