
ఢిల్లీ , 20 సెప్టెంబర్ (హి.స.)
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్తంగా తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఓ కీలక అడ్వైజరీని జారీ చేసింది.
సెప్టెంబర్ 28 నుంచి 30, 2026 వరకు అంటే 3 రోజుల పాటు ఈ సమ్మె జరగనుంది. సమ్మె కాలంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, కస్టమర్లు తమ అత్యవసర బ్రాంచ్ సంబంధిత లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవాలని ఎస్బిఐ సూచించింది.
సెప్టెంబర్ 11న UFBU నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె తర్వాత, ఈ నెలలో మరో విడత నిరసన చర్యల్లో భాగంగా ఈ ప్రకటన వెలువడింది. అలాగే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లుగా కూడా యూనియన్ ఫోరమ్ ప్రకటించింది.
ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంకు సమ్మె సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో షెడ్యూల్ చేయబడింది. అయితే, దీనికి ముందు సెప్టెంబర్ 26, 27 తేదీలు వరుసగా శనివారం, ఆదివారం కావడంతో.. కస్టమర్లు దాదాపు 5 రోజుల పాటు రెగ్యులర్ బ్రాంచ్ కార్యకలాపాలకు దూరం అయ్యే అవకాశం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..