ఐఐటీ రూర్కీ వేడుకల్లో సంబరాలు: 1,424 మంది చేతుల్లోకి డిగ్రీ పట్టాలు
ప్రసిద్ధ ఐఐటీ రూర్కీ సంస్థలో జరుగుతున్న వార్షిక పట్టభద్రుల ఉత్సవం (దీక్షాంత వేడుకలు) రెండో రోజు కూడా ఎంతో కోలాహలంగా సాగింది.
It Roorkee


హైదరాబాద్ , 20 సెప్టెంబర్ (హి.స.)ప్రసిద్ధ ఐఐటీ రూర్కీ సంస్థలో జరుగుతున్న వార్షిక పట్టభద్రుల ఉత్సవం (దీక్షాంత వేడుకలు) రెండో రోజు కూడా ఎంతో కోలాహలంగా సాగింది. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 1,424 మంది విద్యార్థులకు ఆయా విభాగాల డిగ్రీ పట్టాలను ప్రధానం చేశారు. ఇంజనీరింగ్, సైన్స్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఎంతో మంది యువత తమ కలల పట్టాలను అందుకుని మురిసిపోయారు.

విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా వేదికపై ఉన్న ప్రముఖులు సూచించారు. దేశ సాంకేతిక పురోగతిలో నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు తమ నైపుణ్యాలను ఉపయోగించాలని కోరారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఈ క్షణాలను సంతోషంగా జరుపుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande