'తేజస్' యుద్ద విమానంలో భారత్-జపాన్ ఎయిర్ఫోర్స్ చీఫ్లు చక్కర్లు
భారత, జపాన్ దేశాల వైమానిక దళ అధిపతులు రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్పోర్టు వేదికగా భారత్లోనే తయారైన 'తేజస్' యుద్ద విమానంలో ప్రయాణించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
Tejas


ఢిల్లీ , 20 సెప్టెంబర్ (హి.స.)భారత మరియు జపాన్ దేశాల వైమానిక దళ అధిపతులు రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్పోర్టు వేదికగా భారత్లోనే తయారైన 'తేజస్' యుద్ద విమానంలో ప్రయాణించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రెండు దేశాల సైనిక మైత్రిని పటిష్టం చేయడంతో పాటు రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ ప్రత్యేక విన్యాసం నిర్వహించారు.

జోధ్పూర్ వైమానిక స్థావరం నుంచి ఇరు దేశాల ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ఒక్కసారిగా గగనతలంలోకి దూసుకెళ్లి భారతీయ తేజస్ విమాన పనితీరును, దాని సాంకేతిక నైపుణ్యాన్ని స్వయంగా పరిశీలించారు. మన దేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ సాంకేతికతకు, అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యానికి ఈ సంఘటన ఓ గొప్ప నిదర్శనంగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande