ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎన్నిక
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
AP Govt

అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంఘం 18వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు, చేబ్రోలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పీవీ కృష్ణారావు, సహాయ ఎన్నికల అధికారి ఈ.ఫణికుమార్ ప్రకటించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande