
అమరావతి , 21 సెప్టెంబర్ (హి.స.)అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కుండపోత వాన ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి అమలాపురం బస్టాండ్ జలమయమైంది. భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల అన్నదానాలు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా వాన కురవడంతో ప్రసాదాల తయారీకి ఇబ్బందులు పడ్డారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భారీ వర్షం పడింది. ఆలయ ప్రాంగణం జలమయమైంది. మెట్ల మార్గంలో జలపాతంలా ప్రవహిస్తున్న వాననీరును చూసి భక్తులు ఆస్వాదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్