ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..
ఎమ్మెల్సీలు తాతా మధు , నవీన్రెడ్డి లకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
High court


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

ఎమ్మెల్సీలు తాతా మధు , నవీన్రెడ్డి లకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను పోషించిన కేసులో ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసుకు సంబంధించి, నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయొద్దని గతంలో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్కు సైతం న్యాయస్థానం నిరాకరించింది. అయితే, నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలను బలంగా వినిపించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఇద్దరూ దూషించారని ఆయన కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, విధుల్లో ఉన్న పోలీసు అధికారులపైనా వీరు దాడి చేశారని పీపీ వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande