గణేష్ నిమజ్జనోత్సవాలపై పోలీసుల స్పెషల్ నజర్
గణేష్ నిమజ్జనోత్సవాలపై పోలీసుల స్పెషల్ నజర్
Police


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) వాడవాడలా పూజలు అందుకుంటున్న గణేష్ నిమజ్జనోత్సవాలకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

మలక్పేట్ డివిజన్ పరిధిలో సోమవారం భారీ స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మలక్పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ఫ్లాగ్ మార్చ్లో చాదర్ ఘాట్, మలక్పేట్, దబీరురా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలు పాల్గొన్నాయి. ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తూ ఏరియా డామినేషన్ చేపట్టాయి.

గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా అందించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande