ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఖర్గే తీవ్ర ఆగ్రహం: కేంద్ర ఎన్నికల సంఘానికి సంధించిన ఘాటు ప్రశ్నలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఖర్గే తీవ్ర ఆగ్రహం: కేంద్ర ఎన్నికల సంఘానికి సంధించిన ఘాటు ప్రశ్నలు
Priyank Kharge ,Karnataka HM


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సవరణ ప్రక్రియను వ్యవస్థను దెబ్బతీసే ఓ వికృత రూపంగా అభివర్ణించిన ఆయన, ఇది భారతీయ పౌరుల ఓటు హక్కును హరించే కుట్రగా మారుతోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రధానాంశాలు:

-

ప్రముఖులకు కూడా నోటీసులు: ఓటర్ల సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఒక్క ఢిల్లీలోనే సుమారు 33 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయని ఖర్గే తెలిపారు. ఈ జాబితాలో భాజపా సీనియర్ నేత ఎల్‌.కె. అడ్వాణీ, కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని, ఈ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా సాగుతుందో అనడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు.

-

విఐపి ఓటర్లు వర్సెస్ సాధారణ పౌరులు: ప్రముఖుల ఓటర్ రికార్డులపై విచారణ పూర్తి కాగానే ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ 'విఐపి ఓటర్లు' అని వర్గీకరించడాన్ని ఖర్గే తప్పుబట్టారు. రాజ్యాంగం అందించిన ఒక వ్యక్తి - ఒకే ఓటు - ఒకే విలువ అనే ప్రాథమిక సూత్రానికి ఇది విరుద్ధమని, భారతదేశంలో ఓటర్లను ప్రత్యేక విఐపిలుగా, సాధారణ పౌరులుగా వర్గీకరించడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

-

భారీగా ఓట్ల తొలగింపు: దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ సవరణ ప్రక్రియలో ఇప్పటివరకు 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 13.8 కోట్ల మంది (మొత్తం ఓటర్లలో సుమారు 14.6 శాతానికి పైగా) పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. సరైన తనిఖీలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఓట్లను ఎలా తొలగిస్తారని ఆయన నిలదీశారు.

-

పశ్చిమ బెంగాల్ ఆధారాలు: పశ్చిమ బెంగాల్‌లోని ఓటర్ల సవరణపై సుప్రీంకోర్టుకు సమర్పించిన డేటాను ఉటంకిస్తూ.. తొలగించిన ఓట్లపై దాఖలైన అప్పీళ్లలో దాదాపు 93 శాతం తిరిగి సరైనవేనని తేలాయని ఆయన గుర్తుచేశారు. మొదటి దశల్లో నిర్లక్ష్యంగా కోట్ల మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేశారనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ఈ నోటీసులు కేవలం వివరాల ధృవీకరణ కోసమేనని, వెంటనే ఓట్లను తొలగించబోమని ఢిల్లీ ఎన్నికల అధికారి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రసుత్తం ఈ ప్రక్రియలోని పారదర్శకతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande