
వరంగల్, 21 సెప్టెంబర్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచే బలోపేతం చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తో కడియం శ్రీహరి ప్రారంభించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి రావడానికి ఆసక్తి చూపుతున్న ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పార్టీ నియమావళికి కట్టుబడి, క్రమశిక్షణతో ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు. కేవలం పార్టీ పేరు చెప్పుకొని తిరుగుతానంటే తన వద్ద అది చెల్లదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..