
ఆంధ్రప్రదేశ్ , 22 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రభుత్వం తిరిగి వేగవంతం చేసింది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి వీలుగా భూమి అభివృద్ధి, రోడ్ల నిర్మాణం మరియు పరిపాలనా నగర పనుల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు.
హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) సహాయంతో అమరావతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధుల సమీకరణ పూర్తయింది.
ప్రధాన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ విద్యుత్ వ్యవస్థ మరియు ఐటీ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థిక మరియు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్