పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి మరియు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
AP Govt


అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో సంభవించిన వరదలు మరియు సాంకేతిక సమస్యల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల సలహాలతో వేగవంతం చేశారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను జలవనరుల శాఖ అధికారులు మరియు కేంద్ర జలసంఘం (CWC) ప్రతినిధులు నిరంతరం సమీక్షిస్తున్నారు.

గోదావరి నది వరద ఉధృతిని తట్టుకునేలా, నిర్దేశిత కాలపరిమితిలోగా ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రంగం పనిచేస్తోంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల బలపరచడం మరియు ప్రధాన డ్యామ్ పనులను సమాంతరంగా చేపడుతున్నారు. వీటితో పాటు పునరావాస మరియు పునర్నిర్మాణ (R&R) ప్యాకేజీ అమలును వేగవంతం చేసి, ముంపు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించే ప్రక్రియను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు మరియు విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేసినట్లవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande