అన్నవరం ప్రసాదం కౌంటర్లో అక్రమాలపై ఆలయ యాజమాన్యం కఠిన చర్యలు
కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రత్నగిరి దేవస్థాన ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఈఓ కఠిన చర్యలు తీసుకున్నారు.
Annavaram


అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రత్నగిరి దేవస్థాన ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఈఓ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల భక్తులకు అందజేసే ప్రసాదాల వద్ద నిర్వహణ సరిగ్గా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తక్షణమే స్పందించిన దేవాలయ పరిపాలనా వర్గం పరిశీలన జరిపి, విధి నిర్వహణలో అలసత్వం వహించిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులకు అందించే పవిత్రమైన ప్రసాదం తయారీ, పంపిణీ కేంద్రాలలో పూర్తిస్థాయిలో పరిశుభ్రత పాటించాలని, కౌంటర్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండపైకి వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిజిటల్ సేవలతో పాటు ప్రత్యక్ష సేవా కౌంటర్ల వద్ద కూడా నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande