
జడ్చర్ల, 22 సెప్టెంబర్ (హి.స.)
జడ్చర్ల లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును జడ్చర్ల సమీపంలోని మినర్వా హోటల్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.
జూరాల ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూరాల సందర్శనకు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
అనంతరం 44వ జాతీయ రహదారిపై బైఠాయించి బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జూరాల నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..