జూరాలకు 5 టీఎంసీల నీటిని ఇవ్వండి.. కర్ణాటక సీఎంను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో ఏర్పడిన సాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు.
CM Revanth Reddy


హైదరాబాద్ , 22 సెప్టెంబర్ (హి.స.) ఉమ్మడి మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో ఏర్పడిన సాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మంగళవారం ఫోన్లో మాట్లాడారు.

నీరు లేక ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయని, రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిపై డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కర్ణాటకకు బయలుదేరిన మంత్రుల బృందం:

సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మేగా రెడ్డి, జి. మధుసూదన్రెడ్డి మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. అనంతరం ప్రత్యేకంగా బెంగళూరుకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 8 గంటలకు శివకుమార్తో సమావేశమై, విడతల వారీగా 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని అధికారికంగా కోరనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande