
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-ప్రయాగరాజ్ మార్గంలో 20 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
04121 ప్రత్యేకరైలు ఈ నెల 28నుంచి నవంబరు 30వరకు ప్రతీ సోమవారం ప్రయాగరాజ్ నుంచి, 04122 ప్రత్యేకరైలు ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 వరకు ప్రతీ మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరనున్నాయి.
మార్గమధ్యంలో ఖాజీపేట్, మంచిర్యాల, సిర్పూర్-కాగజ్నగర్, బలార్ష, చంద్రాపూర్, సేవాగ్రం, నాగ్పూర్, పందుర్ణ, ఇటార్సి, జబల్పూర్, సత్నా, మాణిక్పూర్ స్టేషన్లలో ఇరువైపులా ఈ ప్రత్యేకరైళ్లకు హాల్ట్ ఉంటుందని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
పండగ రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-సెంగొట్టాయ్ మార్గంలోనూ మరో 18రైళ్లను దక్షిణమధ్యరైల్వే నడపనుంది. 07191 ప్రత్యేక రైలు అక్టోబరు 2నుంచి నవంబరు 27వరకు ప్రతీ శుక్రవారం చర్లపల్లి నుంచి, 07192 ప్రత్యేకరైలు అక్టోబరు 3 నుంచి నవంబరు 28 వరకు ప్రతీ శనివారం సెంగొట్టాయ్ నుంచి బయల్దేరుతాయి.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్