కుప్పంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు.. రూ.327 కోట్లకు పైగా పనులకు శ్రీకారం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
AP CM


అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు గత రెండేళ్లలో పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. కుప్పాన్ని మౌలిక వసతులు, విద్య, వ్యవసాయం, ప్రజా సేవల పరంగా ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.38 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా, ఇతర అభివృద్ధి పనులకు కలిపి దాదాపు రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో రోడ్లు, విద్యా సంస్థలు, ప్రజా సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి సహకరించే కార్యక్రమాలు ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande