ఏపీలో ఉచిత ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం 2.0) అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో భాగమైన 'సూపర్ సిక్స్' పథకాల అమలును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దీపావళి పండుగ కానుకగా 'దీపం 2.0' పథకాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ప్రక్రియను అ
Gas cylinder


అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో భాగమైన 'సూపర్ సిక్స్' పథకాల అమలును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దీపావళి పండుగ కానుకగా 'దీపం 2.0' పథకాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తుంది. లబ్ధిదారులు ముందస్తుగా సిలిండర్ నమోదు చేసుకుని నగదు చెల్లించాల్సి ఉంటుంది, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్ము నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తోంది. గ్యాస్ ఏజెన్సీలు, పంపిణీదారులు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా సిలిండర్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద, దిగువ మధ్యతరగతి మహిళలకు వంట గ్యాస్ భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధార్ అనుసంధానం, రేషన్ కార్డు ఆధారంగా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నారు. అర్హత ఉండి పథకం అందని వారి కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande