ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. కలెక్టర్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ రకాల ధ్రువపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చే పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande