విశాఖపట్నం ఐటీ మరియు పారిశ్రామిక హబ్గా అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలవబడే విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ మరియు పారిశ్రామిక హబ్గా మార్చేందుకు విస్తృత చర్యలు చేపట్టారు.
IT hub


ఆంధ్రప్రదేశ్ , 22 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలవబడే విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ మరియు పారిశ్రామిక హబ్గా మార్చేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ప్రముఖ అంతర్జాతీయ మరియు జాతీయ ఐటీ సంస్థలు తమ క్యాంపస్లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్ సెంటర్లు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు అవసరమైన స్థలాలు, మౌలిక వసతులను ప్రభుత్వం వేగంగా కేటాయిస్తోంది.

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వేగంగా అందిస్తుండటంతో కొత్త పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుండటంతో, విశాఖ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ మరియు పర్యాటక రంగాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. పోర్ట్ ఆధారిత పరిశ్రమల విస్తరణ ద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande