అర్హత లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్లు.. ఖమ్మం జిల్లా సిపిఎం
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటును అందించాలని కోరుతూ, సీపీఎం బృందం సభ్యులు వినతి పత్రం అందజేశారు.
Cpm


ఖమ్మం, 22 సెప్టెంబర్ (హి.స.) జిల్లాలో

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటును అందించాలని కోరుతూ, మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీపీఎం బృందం సభ్యులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం పార్టీ సభ్యులు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులను పక్కనపెట్టి, అర్హత లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఇల్లు మంజూరు చేశారని, రెండో విడుతలో కూడా అదే తంతుగా జరుగుతుందని అన్నారు.

అలా కాకుండా గ్రామాలలో అధికారంతో సర్వే చేయించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయించాలని కోరారు.

మండలంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని, లో వోల్టేజ్ సమస్య వల్ల వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయని, వ్యవసాయ రంగానికి 16 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించి పంటలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande