
మంచిర్యాల, 22 సెప్టెంబర్ (హి.స.) గణేష్ నవరాత్రుల సందర్భంగా పూజలందుకున్న గణనాధుల నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని మంచిర్యాల జిల్లా సబ్ కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం వారు జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి ఘాట్ను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..
నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఘాట్ వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు.
పాత బస్టాండ్ నుంచి గోదావరి ఘాట్ వరకు వీధి దీపాలు, ఘాట్ వద్ద హైమాస్ లైట్లు, ముఖ్యంగా గజ ఈతగాళ్లు, మత్స్యకారులను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..